నాని సింబాగా ‘ది లయన్ కింగ్’ టీజర్ అద్భుతం…!

నాని సింబాగా ‘ది లయన్ కింగ్’ టీజర్ అద్భుతం…!

Published on Jul 9, 2019 11:18 AM IST


ప్రపంచ ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మిస్తున్న జంగిల్ యానిమేషన్ మూవీ “ది లయన్ కింగ్”. అడవికి రారాజులుగా పిలవబడే తండ్రి కొడుకులైన రెండు సింహాలు సింబా, ముఫ్ఫాసాల కథే ఈ “ది లయన్ కింగ్” మూవీ. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలలో విడుదలకానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ కి ముఫ్ఫా కొడుకు అయిన సింబా పాత్రకి నాచురల్ స్టార్ నాని డబ్బింగ్ చెవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆయన డబ్బింగ్ చెప్పిన మూవీ టీజర్ ని నాని స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నేను సింబా, ముప్ఫాసా కొడుకుని అనే టెక్స్ట్ సందేశం కూడా పోస్ట్ చేయడం జరిగింది.

“మానాన్న ఒకసారి చెప్పారు, సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని” అని నాని డబ్బింగ్ ధియేటర్ లో సీరియస్ నోట్ లో చెవుతుంటే, అడవి రాజు ముఫ్ఫాసా తన వారసుడు సింబా ని అడవి జంతువులకు పరిచయం చేసే సన్నివేశం అద్భుతంగా ఉంది. నేను సింబా, ముప్ఫాసా కొడుకుని అనే డైలాగ్ తో టీజర్ ముగిసింది. సింబాగా గా నాని వాయిస్ ఎలాఉంటుందో సినిమా విడుదలయ్యాక తెలుస్తుంది. ఈ మూవీలోని మిగతా ముఖ్య పాత్రలకు జగపతిబాబు,రవి శంకర్,అలీ,బ్రహ్మానందం డబ్బింగ్ చెవుతున్నారు. విజువల్ వండర్ “ది లయన్ కింగ్” ఈనెల 19న తెలుగులో బ్రహ్మాండంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు