మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ – నాని

మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ – నాని

Published on Sep 15, 2019 2:39 AM IST

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ల కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రియాంక అరుళ్ మోహన్‌ హీరోయిన్‌. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 13న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ అయ్యి ఆడియన్స్‌ నుండి సూపర్‌ రెస్పాన్స్‌తో మంచి కలెక్షన్లు సాధిస్తుంది.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘నేను లోకల్‌ సినిమాలో ఒక డైలాగ్‌ ఉంది. ‘ఫీల్డర్స్‌ లేని గ్రౌండ్‌లో ఫోర్‌ కొడితే కిక్కే ఉండదు’ అని ఆ డైలాగ్‌ ఎడిటింగ్‌లో తీసేశాం కానీ ఇప్పుడు వాడాలనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌ రోజు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్‌ అలా పైకి వెళ్ళింది. ఈ రోజు మార్నింగ్‌ షోస్‌ ఇంకా స్ట్రాంగ్‌గా స్టార్ట్‌ అయ్యాయి. ఇప్పటిదాకా మేము మాట్లాడాము ఇకనుండి సినిమా మాట్లాడుతుంది. గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను ఇంతలా ఓన్‌ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్‌ అని చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు