ఇకపై హీరో నాని కొత్త పేరు ‘సింబా’ అంట…!

Published on Jun 29, 2019 1:28 pm IST

ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మించిన యానిమేషన్ జంగిల్ స్టోరీ “ది లయన్ కింగ్” మూవీని ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన భాషలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ జంతువుల చిత్రంలో ముప్ఫా, సింబా అనే రెండు సింహాలు తండ్రీకొడుకులుగా ప్రధానమైన పాత్రలలో కనిపిస్తాయి. ఐతే నాచురల్ స్టార్ నాని “ది లయన్ కింగ్” మూవీలోని సింబా పాత్రకి డబ్బింగ్ చెప్పనున్నారు. ఈ విషయాన్నీ ధృవీకరించే విధంగా కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఈ ఏడాది నన్ను జెర్సీ చిత్రంలో తండ్రిగా చూసారు, జులై నెలలో మళ్ళీ లయన్ కింగ్ మూవీలో ముఫ్ఫా కొడుకైన సింబాగా చూస్తారు అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఈ చిత్రంలో ని ఫన్నీ పాత్రలకు అలీ,బ్రహ్మానందం, అలాగే సీరియస్ పాత్రలకు జగపతిబాబు,రవి శంకర్ డబ్బింగ్ చెవుతున్న విషయం తెలిసిందే. ఇక హిందీలో ముఫ్ఫా పాత్రకు షారుక్ చెబుతుండగా, సింబా పాత్రకు ఆయన కొడుకు ఆర్యన్ డబ్బింగ్ చెవుతున్నారు. జులై 19న హిందీ,తెలుగు,తమిళ భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More