నారా రోహిత్ యాక్ట్ చేయడం లేదట !

నారా రోహిత్ యాక్ట్ చేయడం లేదట !

Published on Feb 7, 2021 2:28 AM IST

nara rohit
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమాలో మరో హీరో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ప్రకారం ఈ సినిమాలో నారా రోహిత్ ఎలాంటి క్యారెక్టర్ చేయడం లేదట. యంగ్ ఎమ్మెల్యే క్యారెక్టర్ లో నారా రోహిత్ కనిపించబోతున్నాడని వస్తున్న వార్తలు పూర్తిగా ఫేక్ అట.

కాగా ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు