వైవిధ్యమైన కథా చిత్రాలను, విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ హీరో వినయ్ పనిగ్రహి ధ్వని అనే డిఫరెంట్ మూవీతో ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. గురువారం ధ్వని చిత్రం ఫస్ట్‌లుక్ ను హీరో నవదీప్ గారు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడతూ, డైరెక్టర్ దుర్గ తనకు రెండు సంవత్సరాలుగా తెలుసు అని, ఆయనలో చాలా కృషి మరియు పట్టుదల ఉందని, ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని అన్నారు.
ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే సీరియస్‌గా తలకి కట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హీరో ఉన్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో సౌండ్ కి సంబందించిన వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి జీవితం లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల నుండి ఎలా బయటపడ్డాడు అనేది మూవీ కాన్సెప్ట్ అంటూ చిత్ర యూనిట్ పేర్కొనడం జరిగింది.
లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది, కథానాయకుడి పాత్ర సరికొత్త డైమన్షన్‌లో ఉంటుందని ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. పరమ కృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ పతాకంపై పరమ కృష్ణ సాన సమర్పణలో సాధన నన్నపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ నాగ దుర్గ రావు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశలో ఉంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిక్ అబ్యాంకర్ మరియు ఆనంద్ నంబియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంఆర్. రాజకీష్ణన్ గారు సౌండ్ మిక్సింగ్ కి పనిచేస్తున్నారు.


