నితిన్ ముచ్చటగా మూడో సినిమా కూడా ప్రకటించేశాడు…!

Published on Jun 24, 2019 11:43 am IST

యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలు ప్రకటిస్తూ తన అభిమానులలో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో “భీష్మ” షూటింగ్ లో పాల్గొంటున్న నితిన్,నిన్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రకుల్,ప్రియా వారియర్లతో చేస్తున్న మూవీ పూజా కార్యక్రమం పూర్తి చేశారు. మళ్ళీ నేటి ఉదయమే మరో సినిమా ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

తన మూడవ చిత్రంగా నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో “రంగ్ దే” అనే చిత్రాన్నిచేస్తున్నట్లు ప్రకటించారు. ఆకర్షణీయమైన డిజైన్లో ఉన్న ‘రంగ్ దే’ మూవీ అనౌన్సుమెంట్ పోస్టర్లో ‘గివ్ మీ లవ్’ అనే టాగ్ లైన్ యాడ్ చేశారు. ఇది పక్కా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా,వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More