అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించబోతున్న హీరో !

‘అతనొక్కడే, కిక్, రేసు గుర్రం, టెంపర్’ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ ‘నాపేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభిస్తోంది. బన్ని ఈ సినిమాలో కోపం ఎక్కువ ఉన్న సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

అల్లు అర్జున్ తండ్రి పాత్రలో తమిళ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాల్లో ప్రధాన్ పాత్రలు చేసిన అర్జున్ గతలోమో ‘లై’ సినిమాలో విలన్ గా కూడా నాటికిఞ్హిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బోమైన్ ఇరాని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.