బాలీవుడ్ దర్శకుడి కథకు ఒకే చెప్పిన ప్రభాస్?

Published on Aug 28, 2021 3:00 am IST

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాలను చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమాకు ఒకే చెప్పినట్టు టాక్ వినిపిస్తుంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమాని చేసేందుకు ఇంతకుముందే ప్రభాస్ ఓకే చెప్పగా, తాజాగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చెప్పిన కథను ప్రభాస్ విన్నాడని, కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :