ప్ర‌భాస్ ఆ విషయంలో రికార్డు కొట్టినట్టేనా?

Published on Jun 23, 2022 2:00 am IST

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు హీరో ప్ర‌భాస్. ఆ త‌ర్వాత సాహో చిత్రం సౌత్‌లో డీలా ప‌డిపోయినా.. ఉత్త‌రాదిన మాత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. మార్కెట్ ప‌రంగా ప్ర‌భాస్ క్రేజ్ మ‌రింత పెరిగిపోయింది. ఇక ఈ ఏడాది విడుద‌లైన రాధేశ్యామ్ బాక్సాపీస్ వ‌ద్ద బోల్తా కొట్టినా ప్ర‌భాస్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదని చెప్పాలి.

అది ఎలా అంటే రాధేశ్యామ్ వ‌ర‌కు రూ.75 కోట్లు పారితోషికం తీసుకున్న ప్ర‌భాస్ సలర్ సినిమాకి సంత‌కం చేసే నాటికి దానిని రూ.100 కోట్ల‌కు పెంచేసాడని టాక్. అయితే తాజాగా ప్ర‌భాస్ మ‌రోసారి రెమ్యున‌రేష‌న్ పెంచాడ‌న్న వార్త ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది. లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ప్ర‌భాస్ పారితోషికాన్ని రూ.120 కోట్ల‌కు పెంచాడ‌ట. అయితే ఇందులో ఎంతమేరకు నిజముందనేది తెలియదు కానీ.. ఇదే కనుక నిజమైతే ఇంత మొత్తంలో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న వ‌న్ అండ్ ఓన్లీ సౌతిండియా స్టార్ ప్ర‌భాస్ కానున్నాడు.

సంబంధిత సమాచారం :