రొమాంటిక్ సీన్స్ లో ‘ఇద్దరి లోకం ఒకటే’ !

Published on Sep 9, 2019 11:04 pm IST

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఇక ‘దిల్‌’రాజు, ‘‘రాజ్‌ తరుణ్‌ కాంబినేషన్ లో వస్తోన్న రెండో చిత్రం ఇది. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఈ చిత్రం ఉంటుందట.

ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చుతున్నారు. అయితే రాజ్ తరుణ్ కు హిట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. గత ఏడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. మొత్తానికి ‘ఇద్దరి లోకం ఒకటే’తో రాబోతున్నాడు. మరి ఈ సినిమాతోనైనా ఈ యంగ్ హీరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More