రాజశేఖర్ ఓవర్ యాక్టింగ్ చెయ్యకుండా వాళ్లే కంట్రోల్ చేశారట !

Published on Jun 25, 2019 10:36 am IST

‘గరుడ వేగ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరో రాజశేఖర్ ప్రస్తుతం యువ దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ‘కల్కి’ చిత్రంతో రాబోతున్న విషయం సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాజశేఖర్ తన నటన పై తానే సైటర్లు వేసుకున్నారు. తనకు ఓవర్ గా నటించడం అలవాటు చేసేసారని, దాంతో గతంలో చేసిన సినిమాల్లో తన నటన కామెడీగా మారిందని.. కానీ, గరుడవేగ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు నా ఓవర్ యాక్టింగ్ ను కంట్రోలు చేశారన్నారు.

మీరు ఇప్పటికే పెద్ద సీనియర్ ఆఫీసర్.. మీ పాత్ర ప్రకారం ఇవన్నీ మీకు కొత్త కాదు అని చెప్పి తన నుండి గరుడవేగలో చక్కని నటనను రాబట్టుకున్నాడని రాజశేఖర్ తెలిపాడు. అలాగే ఇప్పుడు కల్కి సినిమాలో కూడా నేను ఓ సన్నివేశంలో ప్రక్కనున్న వాడితో కూడా అరుస్తూ ఓవర్ గా యాక్ట్ చేస్తోంటే.. పక్కనున్న వ్యక్తి దగ్గర కూడా ఎందుకు అంత పెద్దగా అరుస్తున్నారని ప్రశాంత్ వర్మ కూడా నేను ఓవర్ యాక్టింగ్ చెయ్యకుండా నన్ను బాగా కంట్రోల్ చేసాడని రాజేశేఖర్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి వైవిధ్యమైన కథతో యాక్షన్ ఎంటర్టైనెర్ గా రాబోతున్న కల్కి సినిమాలో నందిత శ్వేతా, ఆదా శర్మ, రాహుల్ రామకృష్ణ, పూజిత పొన్నాడ, నాజర్, సిద్ధూ, జొన్నలగడ్డ, శత్రు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, రాజశేజర్ కూతుళ్లు శివాని , శివాత్మిక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More