చట్టాన్ని గౌరవించి ఫైన్ కట్టానంటున్న హీరో రామ్

Published on Jun 25, 2019 5:52 pm IST

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హీరో రామ్ చేస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ ఆఖరి దశ పనుల్లో ఉంది. ఇదిలా ఉండగా సినిమా టైటిల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ చార్మినార్ పరిసరాల్లో షూటింగ్ జరిపింది. షూటింగ్ సమయంలో రామ్ చార్మినార్ వద్ద సిగరెట్ తాగారట. దీంతో అక్కడున్న పోలీసులు ఆయనకు 200 రూపాయల ఫైన్ విధించారు. అంతటితో వివాదం ముగియలేదు.

సోషల్ మీడియాలో ఈ విషయంపై విమర్శలు వెల్లువెత్తాయి. బ్రేక్ సమయంలో రామ్ నో స్మోకింగ్ ఏరియాలో సిగరెట్ కాల్చాడని, అందుకే ఫైన్ పడిందని పెద్ద చర్చ సాగింది. దీంతో స్పందించిన రామ్ ‘ నా టైమ్, పబ్లిక్ టైమ్ వేస్ట్ చేయడం ఇష్టంలేక స్పందించలేదు. తమ్ముళ్లూ.. అది బ్రేక్ సమయంలో తాగింది కాదు, సీన్ కోసమే తాగాను. టైటిల్ సాంగ్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అప్పటికీ చట్టాన్ని గౌరవించి ఫైన్ కట్టాం’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే నాభ నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను జూలై 18న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More