స్టార్ డైరెక్టర్ తో ‘ఇస్మార్ట్‌ హీరో’ !

స్టార్ డైరెక్టర్ తో ‘ఇస్మార్ట్‌ హీరో’ !

Published on Sep 9, 2019 9:19 AM IST

స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పటికీ.. వినాయక్ కి పరిస్థితులు పెద్దగా అనుకూలించలేదు. హీరో, నిర్మాత ఒకే అయ్యాక కూడా కథ కుదరక.. ఎట్టకేలకూ ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్ర‌మ్ వేద‌’ తెలుగులో వెంకటేష్ – నారా రోహిత్ కాంబినేషన్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ అవ్వబోతుందని రూమర్స్ వచ్చాయి.. చివరికి అవి కూడా ఒట్టి రూమర్సే అని తేలిపోయింది. ఏది ఏమైనా వినాయక్ నుండి ఇప్పుడు మళ్లీ ఇంకో అప్ డేట్ వచ్చింది.

ఇటివలే ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో సూపర్ హిట్‌ అందుకున్న రామ్‌ హీరోగా వినాయక్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుందట. కాగా ఈ సినిమా పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని.. త్వరలోనే సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక రామ్ ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. అయితే వినాయక్ రామ్ తో చేయబోయే సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు