‘సింగర్’గా మారిన ఎనర్జిటిక్ హీరో !

Published on Sep 26, 2018 10:22 am IST

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా, దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో శరవేగంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ తన స్వర నైపుణ్యాన్ని చూపించనున్నారు. సంగీత స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ ప్రోత్సాహంతో రామ్ ఈ సినిమాలో ఓ పాట పాడి, సరికొత్తగా సింగర్ అవతారం ఎత్తారు. ఇప్పటికే రికార్డు చేయబడిన ఈ పాట చాలా బాగా వచ్చిందట,

మంచి లవ్ సబ్జెక్ట్ తో ఎంటర్ టైనర్ గా సాగనున్న ఈ చిత్రంలో రామ్ కొత్తగా కనిపించనున్నారని.. తన కామెడీ టైమింగ్ దగ్గర నుంచి, తన మాడ్యులేషన్ వరకు ఎంతో కేర్ తీసుకోని మరి ఈ చిత్రంలో రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. కాగా సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పని చేసిన టీమే ఈ చిత్రానికి కూడా కలిసి పని చెయ్యడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ ఉంది. రామ్ సరసన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రణీత సుభాష్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. ప్రకాష్ రాజ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీత సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ ఎంటర్టైనర్ ను దసరా కానుకగా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :