షూటింగ్ లో ప్రమాదానికి గురైన హీరో సందీప్ కిషన్.

Published on Jun 15, 2019 7:44 pm IST

యంగ్ హీరో సందీప్ కిషన్ ఓ సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంలో గాయాలపాలయ్యారు.జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తెనాలి రామ కృష్ణ’ మూవీ లో ఓ యాక్షన్ ఎపిసోడ్ కొరకు ఏర్పాటు చేసిన బ్లాస్టింగ్ వలన ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఫైట్ మాస్టర్ నిర్లక్ష్యంతో పాటు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం ఈ సంఘటనకు కారణాలుగా తెలుస్తుంది. గాయాలపాలైన సందీప్ కిషన్ ను దగ్గర్లో గల కర్నూల్ హాస్పిటల్ కి తరలించారని సమాచారం.

కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘తెనాలి రామ కృష్ణ’ మూవీ లో హీరోయిన్ గా హన్సిక నటిస్తుండగా, అగ్రహారం నాగిరెడ్డి,సంజీవ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More