హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన హీరో శర్వానంద్.

Published on Jun 22, 2019 10:00 am IST

హీరో శర్వానంద్ కొద్దిరోజుల క్రితం సమంతతో కలిసి నటిస్తున్న”96″ మూవీ షూటింగ్ సందర్భంగా థాయిలాండ్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. నిపుణుల సమక్షంలో స్కై డైవింగ్ చేస్తున్న సమయంలో లాండింగ్ సరిగా జరగకపోవడం వలన శర్వానంద్ కుడి భుజానికి బలమైన గాయమైంది. దీనితో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న ఆయన హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్ లో చేరగా వైద్యులు ఓ క్లిష్టమైన ఆపరేషన్ చేశారు.

ఐతే శర్వానంద్‌ శుక్రవారం ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్‌ చేసారని సమాచారం. రెండు నెల విశ్రాంతి అవసరం అని చెప్పిన వైద్యులు ఆయన మెల్లగా కోలుకుంటున్నారని చెప్పారు. శర్వానంద్ ప్రస్తుతం ’96’తోపాటు, రణరంగం అనే మరో మూవీలో హీరో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More