పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా యంగ్ హీరో

Published on Oct 8, 2019 10:27 pm IST

యంగ్ హీరో శ్రీవిష్ణు భిన్నమైన చిత్రాలలో నటిస్తూ విలక్షణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, వంటి వైవిధ్యమైన చిత్రాలలో నటించిన ఈ హీరో ఇటీవల బ్రోచేవారెవరురా మూవీ తో హిట్ అందుకున్నారు. కమర్షియల్ గా మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం మంచి చిత్రంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తిప్పరా మీసం అనే చిత్రంలో నటిస్తున్న శ్రీ విష్ణు నేడు మరో చిత్రాన్ని ప్రకటించారు.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఎం ఎల్ వి సత్యనారాయణ నిర్మాతగా దర్శకుడు ప్రదీప్ వర్మ తెరకెక్కించనున్న తాజా చిత్రంలో హీరోగా శ్రీవిష్ణు కన్ఫర్మ్ ఐయ్యారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో శ్రీ విష్ణు పోలీస్ పాత్ర చేయనున్నారు. డ్యూటీ పట్ల నిబద్దత కలిగిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా శ్రీవిష్ణు కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించడం మరో విశేషం. త్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ మూవీ పూర్తి వివరాలు కొద్దిరోజులలో ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More