‘ఎన్టీఆర్’ సినిమా కోసం ఐదు కిలోలు తగ్గిన ‘హీరో’ !

‘ఎన్టీఆర్’ సినిమా కోసం ఐదు కిలోలు తగ్గిన ‘హీరో’ !

Published on Sep 23, 2018 4:42 AM IST

‘నటరత్న, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ ఎన్టీఆర్ జీవితకథను దర్శకుడు క్రిష్ శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తేలింసిదే. బాలకృష్ణ నటించడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ప్రధానపాత్రల గెటప్స్ ని రివీల్ చేస్తూ వస్తోన్న చిత్రబృందం
నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా.. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ, ఇటీవలే ఓ పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సుమంత్ ఏఎన్నార్ గెటప్ లో ఏఎన్నార్ లా బాగా ఆకట్టుకున్నాడు.

కాగా సుమంత్ తాజగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన తాతగారు ఏఎన్నార్ ల మారడానికి తీసుకున్న జాగ్రత్తలు వివరించారు. ఏఎన్నార్ ఫిజిక్ తీసుకురావడానికి తానూ గత నెలలో 5 కిలోలు తగ్గినట్లు చెప్పారు. గత 5 సంవత్సరాల నుండి ఏఎన్నార్ పాత సినిమాలు మరియు ఆయన ఇంటర్వ్యూలను చాలా అబ్జర్వ్ చేస్తున్నాని, అందుకే తాతగారి గెటప్ లో ఆయన్ని గుర్తుచెయ్యగలిగానని తెలిపారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు