సూర్య కాన్ఫిడెంట్ చూస్తుంటే హిట్ కొట్టేలా ఉన్నాడే

సూర్య కాన్ఫిడెంట్ చూస్తుంటే హిట్ కొట్టేలా ఉన్నాడే

Published on Sep 14, 2019 1:07 PM IST

తమిళ హీరో సూర్య తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నటులలో ఒకరు. గజిని, సింగం సిరీస్ చిత్రాలతో ఆయన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు. ఐతే గత కొద్దికాలంగా సూర్య నుండి ప్రేక్షకులు ఆశించిన మంచి చిత్రాలు రావడంలేదు. ఇటీవల ఆయన నటించిన ఎన్ జి కె చిత్రం కూడా పరాజయం పాలైంది. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ బందోబస్త్ ఈనెల 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ వేదికగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం జరిగింది.

కాగా ఈ వేదికపై మాట్లాడిన హీరో సూర్య ఈ చిత్ర విజయం పట్ల గట్టి ఆశాభావం వ్యక్తం చేశారు. నా నుండి ఆశించే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని ధీమాగా చెప్పడం జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఒక ప్రాంతానికి చెందిన అంశాలు కాకుండా ఇండియా మొత్తానికి సంబంధించిన అంశాలు ఉంటాయి అన్నారు. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి ధన్యవాదాలు తెలిపిన సూర్య, కొందరు అభిమానులతో మాట్లాడం జరిగింది. ఈ వేడుకలో నిర్మాత సురేష్ బాబు తో పాటు, హీరో ఆర్య, సయేశా, దర్శకుడు కెవి ఆనంద్ తో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు