సూర్య కోసం కొత్త నేపథ్యం !

Published on Feb 28, 2021 3:00 am IST


తమిళ్ స్టార్ హీరో సూర్యకి చాలా సంవత్సరాలు తరువాత ఆకాశం నీ హద్దురా అంటూ మంచి హిట్ వచ్చింది. మరి ఇలాంటి సినిమా తీసిన తరువాత.. మళ్లీ ఎలాంటి సినిమాతో రావాలి. ఇప్పుడు ఇదే విషయాన్ని సూర్య తన తరువాత సినిమా డైరెక్టర్ కి క్లారిటీ ఇచ్చాడట. కాగా సూర్య ఇప్పటికే యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. హరికి సూర్య ఈ సారి మనం కొత్తగా చేద్దాం అంటూ లంక ప్రాంతానికి సంబంధించిన ఓ ఐడియాని సూర్య, హారికి చెప్పినట్లు.. హరి ఆ ఐడియా పై వర్క్ చేస్తోన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా వీరి కలయికలో లంక నేపథ్యంలో సాగే ప్రేమ కథ సినిమాగా రాబోతుందట. మరి లంక నేపథ్యంలో సినిమా అంటే.. కచ్చితంగా కొత్తగా ఉంటుంది. సూర్య గతంలో ఎన్నడూ అలాంటి సినిమా చేయలేదు. పైగా లంక నేపథ్యం పై తమిళ ప్రజలకు కాస్త ఆసక్తి ఎక్కువు ఉంటుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో.

సంబంధిత సమాచారం :