హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య

Sushant

బాలీవుడ్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. యంగ్ సెన్సేషన్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య చేసుకున్నారు. నేడు ఉదయం ఆయన ముంబై బాంద్రా లోని తన నివాసంలో ఉరి వేసుకున్నట్లు తెలుస్తుంది. సక్సెస్ ఫుల్ హీరోగా కెరీర్ లో ముందుకు వెళుతున్న సుశాంత్ సింగ్ ఆత్మ హత్య వెనుక గల కారణాలు ఏమిటనేది ఇంకా తెలియదు. సుశాంత్ వయసు కేవలం 34 సంవత్సరాలు మాత్రమే. ఈనెల 3న ఆయన 2002లో మరణించిన వారి అమ్మను తలచుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.

బుల్లి తెర నటుడిగా గుర్తింపు తెచుకొన్న రాజ్ పుత్ 2013లో వచ్చిన కై పోచె చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. స్టార్ క్రికెటర్ ధోని బయోపిక్ లో ఆయన నటించడం విశేషం. ఆయన గత చిత్రం చిచ్చోరి మంచి విజయం సాధించింది. సుశాంత్ మరణ వార్త విన్న బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది.

Exit mobile version