‘ఆర్య’ చూసి హీరో అవ్వాలని డిసైడ్‌ అయ్యాను – హీరో తనిష్క్‌రెడ్డి

‘ఆర్య’ చూసి హీరో అవ్వాలని డిసైడ్‌ అయ్యాను – హీరో తనిష్క్‌రెడ్డి

Published on Sep 4, 2019 7:35 PM IST

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌, శుభంగిపంత్‌ హీరోహీరోయిన్లుగా రామకృష్ణ వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దర్పణం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 6న గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో తనిష్క్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాది నల్గొండ జిల్లా. ‘ఆఐదుగురు’, ‘దునియా’, ‘చక్కిలిగింత’ లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్‌ చేశాను. అలాగే స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ గారితో ‘ఐ యామ్‌ దట్‌ చేంజ్‌’ అనే షార్ట్‌ ఫిలిం చేశాను. అది నా మూవీ కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడింది. ‘సకలకళావల్లభుడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాను. ‘దర్పణం’ హీరోగా నా సెకండ్‌ మూవీ. ‘ఆర్య’ సినిమా చూసి హీరో అవ్వాలని డిసైడ్‌ అయ్యి బరువుతగ్గాను. తర్వాత యాక్టింగ్‌, డాన్సులు, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను.

ఈ సినిమా విషయానికి వస్తే.. అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు అనుకోకుండా ఒక మర్డర్‌ మిస్టరీలో లాక్‌ అయితే దాన్ని ఎలా ఛేదించాడు ? దాని నుండి ఎలా బయటపడ్డారు? అనేది కథాంశం. సినిమా మొత్తం ఒక మర్డర్‌ మిస్టరీ చుట్టే తిరుగుతుంది. సెకండ్‌ హాఫ్‌ కి వచ్చే సరికి ట్విస్ట్‌లు, టర్నులతో భయపెడుతుంది. అలాగే ఈ సినిమాలో సెల్లార్‌లో ఒక యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉంటుంది. అది ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుంది. అలాగే ప్రీ క్లైమాక్స్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, సతీష్‌ ముత్యాల గారి కెమెరా సినిమాకు అదనపు ఆకర్షణ. అలాగే ఈ సినిమాలో ఇంట్రడక్షన్‌ సాంగ్‌ హైలెట్‌గా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు