టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్నా.. ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా చాల కూల్ గా చిన్న ఖాళీ దొరికిన ఏ షాపింగ్ మాలో ఓపెన్ చేసుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే ప్రసుతం విజయ్ దేవరకొండ లుక్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సారి విజయ్ దేవరకొండ హెయిర్ స్టైల్ మార్చడంతో లుక్ చాల బాగుంది. అయితే విజయ్ దేవరకొండ ఈ న్యూ లుక్ వేరే ఏదైనా సినిమా కోసమా లేక ఏదైనా యాడ్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి విజయ్ దేవరకొండ లుక్ అయితే మాత్రం బాగా వైరల్ అవుతుంది.
ఇక విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన గత సినిమా డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం తన తదుపరి సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ షూటింగ్ చాల వరకూ పూర్తి చేసిన విజయ్.. ఈ మూవీ తరువాత పూరి ‘ఫైటర్’ మూవీ కోసం సిద్ధం కానున్నాడు.


