డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ ?

డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ ?

Published on Sep 8, 2019 8:14 PM IST

పూరి జగన్నాథ్ మొత్తానికి ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ పాత్రలో ఓ మాజీ హీరో నటించనున్నాడని తెలుస్తోంది. అయితే ఇటివలే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ‘ఫైటర్’ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కాగా తాజాగా ఈ టైటిల్ నే చిత్రబృందం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

మరి ఈ సినిమా తన శైలి జోనర్ లోనే తెరకెక్కనుంది.. అయితే సినిమాలో హీరోయిన్స్ గా ఎవరు నటించనున్నారు.. అలాగే మిగిలిన నటీనటులు ఎవరు అనే విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమా కూడా పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌ పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు