విజయ్ దేవరకొండతో శ్రీదేవి కూతురు ?

Published on Sep 26, 2018 12:02 pm IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన నటించనున్నారని, ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అలాగే తమిళంలో రెండు చిత్రాల్లో ఆమె నటించనున్నారట. సౌత్ ఇండస్ట్రీ దర్శకులు జాహ్నవి కపూర్ ని తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవాలని.. ఆమెను అప్రోచ్ అవుతుండగా.. జాన్వి కూడా సౌత్ సినిమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారట.

ఇక జాహ్నవి కపూర్ ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌ కి పరిచయం అయింది. ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. ‘ధడక్‌’ చిత్ర దర్శకుడు శశాంక్‌ ఖైటన్‌ జాహ్నవి కపూర్ నుండి మంచి నటన రాబట్టగా ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌ ‘ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌’ పై ఈ చిత్రాన్ని నిర్మించి ఆమెకు బాలీవుడ్ లోకి మంచి ఎంట్రీ అందించారు. ప్రస్తుతం ‘తఖ్త్‌’ అనే చారిత్రక చిత్రంలో జాన్వి నటించనున్నారు. ఈ చిత్రాన్ని కూడా ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More