వైరల్ వీడియో: ఫుట్ బోర్డుపై ఇబ్బందిపడ్డ విజయ్ సేతుపతి..!

Published on Aug 24, 2021 12:32 am IST

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, అక్కినేని సమంత, నయనతార కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా “కాతువాకుల రెండు కాదల్‌’. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంత, నయన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే దీనికి సంబందించిన షూటింగ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ బస్సులో ఫుట్‌బోర్డ్‌ పై విజయ్ సేతుపతి ప్రయాణం చేస్తుండగా, అతడి ముందు తెల్ల చీరలో హీరోయిన్స్ అక్కినేని సమంత, నయనతార నిలబడ్డారు. దీంతో విజయ్‌ సేతుపతి ఫుట్ బోర్డుపై చాలా ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్‌ని హైదరాబాద్‌లో జరపగా, ఇటీవల పుదుచ్చేరిలో షూటింగ్ మొదలుపెట్టారు.

సంబంధిత సమాచారం :