ఫలక్ నుమాదాస్ పంధా మార్చాడు

Published on Aug 14, 2019 1:20 pm IST

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల ఫలక్ నుమా దాస్ అనే పక్కా తెలంగాణా మాస్ పోరగాడిగా కనిపించి అలరించాడు. ఈ హీరో తాజా చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది.కొత్త దర్శకుడు నరేష్ రెడ్డి తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని, గతంలో రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో ‘హుషారు’ వంటి అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రాన్ని నిర్మించిన బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని సమాచారం. వచ్చే నెల మూడవ వారం నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ నిరవధికంగా జరగనుంది.

ఇక విశ్వక్ సేన్ గతంలో , ఫలక్ నుమా దాస్ తో పాటు, పెళ్లి చూపులు వంటి అవార్డు విన్నింగ్ మూవీకి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “ఈ నగరానికి ఏమైంది?” చిత్రంలో నటించారు. త్వరలో సెట్స్ పైకెళ్లనున్న ఈ కొత్త చిత్రంలో నటించే నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం :