“ఆర్.ఆర్.ఆర్” హీరోయిన్ అలా కూడా అలరించనుందట.

Published on Jun 26, 2019 12:36 pm IST

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్,వీడియోస్,మూవీ న్యూస్ పంచుకుంటూ ఉంటారు. అందుకే అమ్మడు ఇంస్టాగ్రామ్,ట్విట్టర్ అకౌంట్స్ లో మిల్లియన్స్ కొద్దీ ఆమెను ఫాలో అవుతూ ఉంటారు. తాజాగా అలియా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టేశారు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాలతో పాటు,మూవీ అప్డేట్స్ ,ఫొటోస్, ఈవెంట్స్ అన్ని తన అభిమానులకు చేరేలా చేస్తారట. యూట్యూబ్ ఛానల్ కొరకు ఆమె చేసిన మొదటి వీడియోలో ఈ విషయాలన్నీ చెప్పడంతో పాటు,ఛానల్ ని లైక్, షేర్, సబ్స్ క్రైబ్ చేసుకోండని విజ్ఞప్తి చేస్తుంది. ప్రారంభించిన కొద్దినిమిషాలలో లోనే వేలకొద్దీ సబ్స్క్రైబర్స్ యాడ్ కావడం మరో విశేషం.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్ ఆర్ ఆర్” మూవీలో అలియా చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు, రణ్వీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న “బ్రహ్మాస్త్ర” మూవీలో కూడా అలియా హీరోయిన్ గా చేస్తుంది.

సంబంధిత సమాచారం :

X
More