కెరీర్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న మెహ్రీన్.

Published on Jun 6, 2020 3:00 am IST

బబ్లీ బ్యూటీ మెహ్రీన్ కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలే దక్కించుకుంది. ఆమె నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ, మహానుభావుడు, ఎఫ్2 మంచి విజయాలు అందుకున్నాయి. ఆమె తాజాగా నటించిన తమిళ చిత్రం పటాస్, తెలుగులో నాగ శౌర్య హీరోగా వచ్చిన అశ్వథామ కూడా ఓ మోస్తరు విజయాలు నమోదు చేశాయి. ఐతే ఇటీవల ఆమెపై వచ్చిన వివాదాలు కెరీర్ ని దెబ్బ కొట్టాయి.

రెమ్యూనరేషన్ మరియు ఖర్చుల విషయంలో ఆమె నిర్మాతలపై చేసిన ఆరోపణలు ఆమెపై నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకు వచ్చాయి. టాలీవుడ్ తో పాటు సౌత్ లో ప్రస్తుతం మెహ్రీన్ కు పెద్దగా అవకాశాలు లేవు. ఐతే తన టాలెంట్ పై నమ్మకముంది అంటున్న మెహ్రీన్ తన కమ్ బ్యాక్ సాలిడ్ గా ఉంటుందని గట్టిగా నమ్ముతుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3లో కూడా హీరోయిన్ గా మెహ్రీన్ నటించనుంది.

సంబంధిత సమాచారం :

More