‘కార్తికేయ 2’లో తెలుగు హీరోయిన్ ఫిక్సా ?

‘కార్తికేయ 2’లో తెలుగు హీరోయిన్ ఫిక్సా ?

Published on May 31, 2020 9:00 AM IST


చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ – 2 ‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ‘కార్తికేయలో హీరోయిన్ గా నటించిన కలర్స్ స్వాతి.. ‘కార్తికేయ 2’లోనూ నటించబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు అది నిజమేనని తెలుస్తోంది. అయితే కలర్స్ స్వాతి ‘కార్తికేయ 2’లో జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తోందని.. ఆమె హీరోకి మాజీ ప్రేయసిగా నటించబోతుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. పైగా సినిమాలో ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు