ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్ లో హీరోయిన్ ఎవరంటే !

ఆర్ఎక్స్ 100 తమిళ రీమేక్ లో హీరోయిన్ ఎవరంటే !

Published on Aug 14, 2018 3:37 PM IST

ఇటీవల విడుదలైన ‘ఆర్ఎక్స్100’ చిత్రం ఎంత సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రం డబుల్ బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 2.80 కోట్ల బడ్జెట్ తో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం 11కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఈసినిమా ఇప్పుడు తమిళ భాషలో రీమేక్ అవుతుంది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరో గా నటిస్తుండగా తాప్సి కథానాయిక పాత్రను పోషించనుంది. హీరో తో పాటు సమానమైన హీరోయిన్ పాత్రలో తాప్సి ఎలా నటిస్తుందో చూడాలి. ఇంకా ఈ చిత్రానికి డైరెక్టర్ ఖరారు కావాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు