మెగా హీరో సినిమాకు హీరోయిన్ దొరికింది !

Published on Apr 18, 2019 11:09 am IST

మెగా ఫ్యామిలీ నుండి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇక గత కొద్దీ రోజులుగా ఈ సినిమా కు హీరోయిన్ ను వెతికే పనిలో వున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్ ను ఖరారు చేశారని సమాచారం. మలయాళ బ్యూటీ దేవిక సంజయ్ ఈ చిత్రంలో కథానాయికగా నటించనుంది.

రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ ,మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం తర్వలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

More