టెంపర్’ రీమేక్ కు హీరోయిన్ దొరికింది !
Published on Feb 24, 2018 5:49 pm IST

2014లో పూరి జగన్నాథ్, జూ.ఎన్టీఆర్ ల కలయికలో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. అందుకే ఈ చిత్రాన్ని హిందీలో ‘సింబ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్లో రణ్వీర్ సింగ్ ఎన్టీఆర్ పాత్రను చేస్తుండగా ఇన్నాళ్లు అతనికి జోడీ వెతికే పనిలో ఉన్నారు మేకర్స్ .
ఇప్పటికే శ్రీదేవి కుమార్తె జాహ్నవితో పాటు పలు ఇతర పేర్లు వినిపించినా చివరకు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ను ఫైనల్ చేశారు దర్శక నిర్మాతలు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆఖరున రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook