మాస్ మహా రాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం రమేష్ వర్మ ఖిలాడీ చేస్తున్నాడు. దీని తరువాత సినిమాని రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ తో చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు మార్చి నుండి ఈ సినిమానే రవితేజ ముందు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇద్దరిలో రాశి ఖన్నాను ఆల్ రెడీ హీరోయిన్ గా ఫైనల్ చేశారట.
కాగా రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.


