ఇంటర్వ్యూ : కాజల్ అగర్వాల్ – ‘రణరంగం’ నా పాత్ర వల్లే ముందుకు వెళ్తుంది !

Published on Aug 9, 2019 6:21 pm IST

హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా ‘రణరంగం’. కాగా ఈ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. మరి ఈ సినిమా గురించి కాజల్ అగర్వాల్ వెల్లడించిన పలు ఆసక్తికర విశేషాలు కాజల్ మాటల్లోనే..

ఈ సినిమా గురించి ?

‘రణరంగం’ ఒక ‘గ్యాంగ్ స్టర్’ కథ. 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’. భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలుస్తాయి.

 

మీ పాత్ర గురించి ?

ఈ సినిమాలో డాక్టర్ రోల్ కనిపిస్తున్నాను. సెకెండ్ హాఫ్ లో నా రోల్ ఎంటర్ అవుతుంది. చాలమంది ఈ సినిమా ఎందుకు చేశావు అంటున్నారు. కేవలం కథ నచ్చబట్టే ఈ సినిమా చేశాను. పైగా నా పాత్ర వల్లే కథ ముందుకు నడుస్తోంది. అది ఎలా అనేది సినిమాలో చూడండి.

 

సీత పై మీరు బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఆ సినిమా ఫలితం పై నిరాశ చెందారా ?

సీత కథను నమ్మి మేం చాల హార్డ్ వర్క్ చేసి ఆ సినిమా చేశాము. కానీ సినిమా రిజల్ట్ మా చేతిలో ఉండదు కదా. ఇప్పటికీ నాకు సీత కథ అంటే ఇష్టమే.

 

మీరు నిర్మాతగా మారుతున్నారని వార్తలు వస్తున్నాయ్ ?

లేదండి. అవ్వన్నీ అవాస్తవాలే. నాకు నిర్మాతగా మారే ఆలోచన అయితే లేదు. అయితే ప్రశాంత్ వర్మ నాకు ఒక లైన్ చెప్పారు. చాల బాగుంది. ఆ సినిమా ఫుల్ స్క్రిప్ట్ కూడా అంతే స్థాయిలో ఉంటే.. ఆ సినిమా చెయ్యొచ్చు. నవంబర్ నుండి ఉండొచ్చు. ఏదైనా కథను బట్టే ఉంటుంది.

 

రవితేజగారితో మరో సినిమాలో నటిస్తున్నారట ?

అవును. రవితేజగారు ఆఫర్ చేశారు. ఆయన కలిసి నటించడం అంటే ఎప్పుడూ ఛాలెంజ్. అయినా నాకు ఛాలెంజ్ రోల్స్ అంటే ఇష్టమే.

 

మీరు తెలుగు, తమిళ్ అండ్ హిందీ భాషల్లో నటిస్తున్నారు ? ఏ భాషలో మీకు ఎక్కువుగా కంఫక్ట్ ఫీల్ అవుతారు ?

నేను నటిగా పుట్టింది తెలుగులోనే కాబట్టి.. తెలుగు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. అయితే మిగిలిన భాషల్లో కూడా నాకు ఎక్కువుగా కంఫక్ట్ నే ఉంటుంది.

 

డైరెక్టర్ సుధీర్ వర్మ గురించి చెప్పండి ?

ఆయనకి స్క్రిప్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంటుంది. ఫస్ట్ ఆయన నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే నాకు నా రోల్ చాల బాగా నచ్చింది. సెట్ లో కూడా ఆయన ప్రతి షాట్ పై కూడా ఎంతో క్లారిటీగా ఉంటారు.

 

శర్వానంద్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది ?

శర్వానంద్ ఈ సినిమాలో అచ్చం ‘గ్యాంగ్ స్టర్’లానే అనిపిస్తాడు. అంతబాగా తను ఆ రోల్ ను ఓన్ చేసుకుని చేశాడు. ఇక తనతో వర్క్ చేయడం చాల హ్యాపీగా అనిపించింది.

 

“మహానటి” చిత్రానికి ఉత్తమ చిత్రం, అలాగే ఉత్తమ నటిగా కీర్తి సురేష్ జాతీయ అవార్డు వచ్చింది ?

అవును. చాల హ్యాపీగా ఫీల్ అయ్యాను. సావిత్రిగారి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’లో కీర్తి సురేష్ నిజంగా ఎంతో అద్భుతంగా నటించింది.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

కమల్ సర్ తో ‘భారతీయుడు 2’లో యాక్ట్ చేస్తున్నాను. అలాగే ఓ తమిళ్ సినిమా కూడా చేస్తున్నాను. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ‘రణరంగం’ సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

సంబంధిత సమాచారం :