మహేష్ కొత్త సినిమాలో హీరోయిన్ ఆమె ?

Published on May 23, 2020 11:22 pm IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేష్ బాబుకు జోడీగా కియారా అద్వానీ ఖాయం అయినట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని, కియారా అద్వానీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతనేది అధికారిక ప్రకటన వెలువడ్డాకే తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించాడు. మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. అన్ని కుదిరితే అక్టోబర్ నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More