సుమంత్ పక్కన ఆ హీరోయిన్ నటించబోతోంది !

సుమంత్ పక్కన ఆ హీరోయిన్ నటించబోతోంది !

Published on Mar 15, 2018 3:55 PM IST

వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమ కథ ‘ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచమైన హీరో సుమంత్. తాజాగా ఈ హీరో మళ్ళిరావా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతమ్ తిన్ననురి డైరెక్ట్ చేసిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా సుమంత్ నటించబోతున్న 25 వ సినిమా ప్రారంభం కానుంది.

మార్చి 18న ఉగాది పర్వదినం సందర్బంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో సుమంత్ 25 వ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. నూతన దర్శకుడు జాగర్లపూడి సంతోష్ ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ధీరజ్ బొగ్గరం, సుధాకర్ రెడ్డి బీరంలు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఇషా రెబ్బ హీరోయిన్ గా నటించబోతోంది. తాజాగా ఈ హీరోయిన్ దర్శకుడు, అ సినిమాల్లో నటించింది.

తాజా వార్తలు