సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న హీరోయిన్ !

కన్నడ కిరిక్ పార్టి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రస్మిక మడోనా ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రముఖ కెమెరామెన్ సాయి శ్రీరామ్ దర్శకత్వంలో నాగ శౌర్య చేస్తున్న సినిమాలో రస్మిక ను ఎంపిక చెయ్యడం జరిగింది. ఈ రెండు సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరుశురం బుజ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రస్మిక నటిస్తోంది.

ఈ రెండు సినిమాలకంటే ముందు రస్మిక నటించిన చలో సినిమా ఫిబ్రవరి రెండున విడుదల కానుంది. వెంకి కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా కు సాగర్ మహతి అందించిన సంగీతం పాపులర్ అయ్యింది. ఈ సినిమా కోసం రస్మిక సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. తెలుగు రాని ఈ అమ్మాయి భాష నేర్చుకొని తనపాత్రకు డబ్బింగ్ చెప్పుకుంది.