రవితేజ సినిమాలో నాని హీరోయిన్ ?

Published on Feb 27, 2021 5:13 pm IST

మాస్ మహా రాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ ఖిలాడీ చేస్తున్నాడు. దీని తరువాత సినిమాని రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ తో చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ వార్తకు సంబంధించి రీసెంట్ గా రవితేజ నుండే అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా మార్చి ఫస్ట్ వీక్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారట, ఇద్దరిలో ప్రియాంక ఆరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేశారట.

కాగా రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :