మగబిడ్డకు జ‌న్మ‌నిచ్చిన రిచా గంగోపాధ్యాయ !

Published on Jun 5, 2021 4:00 pm IST

హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ తాజాగా ఈ భామ తల్లి అయింది. మే 27న ఆమెకు మగబిడ్డ పుట్టాడు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్ట్‌ పెట్టింది. తన బిడ్డకు ‘లుకా షాన్‌’ అనే పేరు పెట్టామని చెప్పుకొచ్చింది. రిచా మాటల్లోనే ‘లుకా షాన్‌.. నువ్వు మా చిరు నవ్వు. మా బాబు మే 27న జన్మించాడు. వీడి రాకతో మా జీవితాల్లో కొత్త సంతోషాలు వచ్చాయి.

లుకా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, రూపురేఖల్లో అచ్చం తన తండ్రిలానే ఉన్నాడు. లుకా.. మా జీవితాల్లో వచ్చినందుకు మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం.’ అని రిచా ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. ‘మిర్చి’ హిట్ తరువాత రిచాకి నాగార్జునతో ‘భాయ్‌’ ఒక్క సినిమానే చేసింది. ఇక ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లి జోనుతో ప్రేమలో పడి, అతనితో వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

సంబంధిత సమాచారం :