ప్రత్యేక పూజలు చేసిన త్రిష !

Published on Aug 23, 2021 8:01 am IST

సీనియర్ హీరోయిన్‌ త్రిష మధ్యప్రదేశ్‌ లోని ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేసింది. అయితే, త్రిష చేసిన పూజలు ఆమె కోసం కాదు అట. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో రాబోతున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం అట. ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌ లో శరవేగంగా జరుగుతోంది.

అయితే, ప్రస్తుత షెడ్యూల్ లో హీరో కార్తీతో పాటు త్రిష, ప్రకాశ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. వారి పై కొన్ని కీలక సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా త్రిష ఈ సినిమాకి సంబందించి ఒక ప్రత్యేక పూజను చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ సినిమాలో స్టార్ హీరో విక్రమ్, మరో స్టార్ ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌ కుమార్, పార్తీబన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం తొలి భాగం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :