హిందీ ‘అర్జున్ రెడ్డి’ నుండి తప్పికున్న హీరోయిన్ !
Published on Sep 9, 2018 6:41 pm IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగులో చిన్న సినిమాగా రిలీజ్ అయి, సంచలనాత్మక విజయాన్ని అందుకొని.. ఇప్పుడు తమిళ, హిందీ భాషల్లోకి కూడా గ్రాండ్ గా రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీలో స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి పాత్రను పోషిస్తుండగా, తమిళంలో స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ అర్జున్రెడ్డి చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

కాగా తాజా సమాచారం ప్రకారం.. హిందీ అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తుండగా తారా సుతారియా హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది. కానీ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమా నుండి సుతారియా తప్పుకుంది. ప్రస్తుతం ఆమె టైగర్‌ ష్రాఫ్ కి జోడిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 లో నటిస్తోంది. దాంతో డేట్స్‌ అడ్జస్ట్ చేయలేక హిందీ అర్జున్‌ రెడ్డి నుండి తప్పుకుందట.

అయితే సుతారియాకి బోల్డ్ క్యారెక్టర్ చేయటం ఇష్టం లేకే ఈ సినిమా నుంచి తప్పుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఏది నిజమో సుతారియాకే తెలియాలి. ఇక వచ్చే ఏడాది జూన్ 21వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ విడుదల చెయ్యాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండటంతో ఈ చిత్రం పై అక్కడ భారీ అంచనాలే ఉన్నాయి. తెలుగులో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన యువ దర్శకుడు వంగా సుందీప్ నే హిందీ వర్షన్ ను కూడా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో నటించే మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

  • 9
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook