
ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ హడావిడి తారాస్థాయికి చేరుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా మంది స్టార్స్ ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొంటుంటే, మరికొంతమంది విలువైన ఓటును సరైన నాయకుడికి వేసి గెలిపించాలని ప్రకటనలు చేస్తున్నారు.
అందులో భాగంగానే మోడల్ నుచి హీరోయిన్ గా మారిన మధు శాలిని ఓ ప్రకటనని రిలీజ్ చేసింది. సినీ గ్లామర్ అనే మార్క్ ఉన్నప్పటికీ ఈ ప్రకటనకి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. ‘నేను చేసి చాలా రోజులయ్యింది. మళ్ళీ ఈ సారి చేయబోతున్నాను. కానీ చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను. మీరు కూడా తీసుకోండి. మీ ఓటును సరైన వ్యక్తికి వేసి నాయకుణ్ణి ఎంచుకోండని’ ఈ ప్రకటనలో తెలిపింది.

