వెంకటేష్, వరుణ్ తేజ్ లకు హీరోయిన్లు సెట్టయ్యారు !

సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ లు కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ‘ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)’ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. ఇకపోతే ఇన్ని రోజులు జరిగిన వరుణ్, వెంకీల సరసన హీరోయిన్లు ఎవరనే చర్చకు తెరపడింది.

123తెలుగు.కామ్ ముందుగా తెలిపినట్టే వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ ప్రిజాదాని ఫైనల్ చేశారు దర్శక నిర్మాతలు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్ నెలలో ప్రారంభించి అదే నెలలో రెగ్యులర్ షూట్ మొదలుపెట్టనున్నారు. ఇకపోతే సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Exit mobile version