పూరి సినిమాకు అదనపు అందం ఆ ఇద్దరు

Published on Jun 30, 2019 9:27 pm IST


పూరి జగన్నాథ్ సినిమాలంటే మాస్ ప్రేక్షకులకు తప్పకుండా ఏదో ఒక ట్రీట్ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో. పూరి దాదాపు తన ప్రతి సినిమాలోనూ కథానాయికలను వారి గత సినిమాల్లో కంటే ఎక్కువ అందంగా చూపిస్తూ ఉంటారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. అయన కొత్త చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నాభ నటేష్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. గత సినిమాల్లో గ్లామర్ షో లేకుండా కనిపించిన ఈ ఇద్దరూ ఈ సినిమాలో మాత్రం అందాలను ఆరబోసేశారు.

ముఖ్యంగా పాటల్లో. ఇప్పటి వరకు బయటికొచ్చిన సినిమా పోస్టర్లు, పాటలకు సంబంధించిన లిరికల్ వీడియోస్ చూస్తేనే ఈ సంగతి అర్థమైపోతోంది. ఉండిపో, జిందాబాద్ జిందాబాద్, దిమాక్ ఖరాబ్ పాటల్లో ఈ ఇద్దరు హీరోయిన్ల గ్లామర్ షో సినిమాకు హైలెట్ అవుతుందని, సింగిల్ స్క్రీన్ ప్రేక్షకులకు కనువిందు చేస్తుందని చిత్ర సన్నిహిత వర్గాల టాక్. మొత్తానికి పూరి ఈ ఇద్దరు అమ్మాయిల్ని తన సినిమాకు అదనపు అందంగా మార్చేశారరు. నిధి, నాభ నటేష్ సైతం అందివచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కమర్షియల్ హీరోయిన్లుగా స్థిరపడిపోవాలని ఆశపడుతున్నారు. జూలై 18వ తేదీన విడుదలకానున్న ఈ సినిమాను పూరి, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More