సీనియర్ స్టార్ హీరో విక్టరీ ‘వెంకటేశ్ , మెగా హీరో వరుణ్ తేజ్ ల కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్ లైన్ . కొద్దీ రోజులక్రితం ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మొదటగా వరుణ్ తేజ్ పాల్గొనగా నిన్న వెంకటేష్ ఆయనతో జాయిన్ అయ్యారు. ఇక ఈ రోజు కథానాయికలు తమన్నా , మెహ్రీన్ లు కూడా ఈ చిత్ర షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ కు జోడిగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడిగా మెహరీన్ నటిస్తున్నారు.
అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నా ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఈ నెల 21 వరకు జరుగనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం ఫై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి .


