నాకెప్పటికీ మెగాస్టార్ ఆయనే – స్టార్ ప్రొడ్యుసర్

Published on Jul 1, 2018 9:26 am IST

క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్ తేజ్‌ కథానాయకుడిగా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత కే ఎస్ రామారావు నిర్మించిన తాజా చిత్రం ‘తేజ్ ఐలవ్యూ’. జూలై 6న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం గురించి కేఎస్ రామారావు మ‌ట్లాడుతూ.. మా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ ఫై ‘తేజ్ ఐలవ్యూ’ 45వ చిత్రంగా కరుణాకరన్‌ దర్శకత్వంలో అందమైన ప్రేమకథతో రూపొందింది. భావోద్వేగమైన సన్నివేశాలు, గోపి సుందర్‌ అందించిన సంగీతం, కరుణాకరన్‌ శైలి మేకింగ్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి. నాకు సినిమాకు సంబంధించి అన్ని విషయాల మీద అవగాహన ఉంది. సినిమాకు ఎప్పుడైనా కథే ప్రాణం అని నమ్మే వ్యక్తిని నేను. నేను నిర్మించిన నలభైఐదు సినిమాల్లో ఐదారు తప్ప అన్ని హిట్ అయ్యాయి. రాంచరణ్‌ మా బ్యానర్ లో సినిమా చేస్తాననడానికి కారణం కూడా మేం నిర్మించిన సినిమాలే అని నమ్ముతున్నా.

ఇక చిరంజీవిగారితో నా రిలేషన్ ఆ రోజుల్లో ఎలా ఉందో ఈ రోజుకి అలాగే ఉంది. ఎందుకంటే ఆయన నాకు ఎప్పటికీ మెగాస్టారే. ఆయన డేట్స్‌ ఇస్తే వెంటనే సినిమా మొదలుపెడతా. ప్రస్తుతం క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లో దర్శకుడు క్రాంతిమాధవ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్లో ఓ చిత్రం ఉంది అక్టోబర్ నుండి మొదలవుతుందని ఆయన తెలిపారు. ‘తేజ్ ఐలవ్యూ’ చిత్రంలో సాయిధ‌ర‌మ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది .

సంబంధిత సమాచారం :