‘హలో గురు’.. లేటెస్ట్ కలక్షన్స్ !

‘హలో గురు’.. లేటెస్ట్ కలక్షన్స్ !

Published on Oct 22, 2018 4:17 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ , అనుపమా జంటగా నటించిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ ఇటీవల విడుదలై బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. పక్కా ఎంటర్టైనెర్ గా వచ్చిన ఈచిత్రం నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.13.18కోట్ల షేర్ వసూళ్లను రాబట్టి విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక నైజాంలో ఈ చిత్రం 6కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా కేవలం నాలుగు రోజుల్లోనే అక్కడ 5కోట్ల షేర్ ను రాబట్టింది.

ఇక ఈచిత్రం ఇప్పటివరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లో 70 శాతం రికవరీ చేసింది. రామ్ కెరీర్ లోనే అత్యదిక కలెక్షన్స్ ను సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేయనుంది.

త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈచిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు