సహస్ర ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాకు హైడ్ అండ్ సీక్ టైటిల్ ను ఖరారు చేశారు. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసి రెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
ఈ చిత్ర టైటిల్ లోగోను దర్శకుడు సుధీర్ వర్మ విడుదల చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు చిన్న రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. నరేంద్ర బుచ్చి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది.
సాక్షి రంగారావు అబ్బాయి సాక్షి శివ, శ్రీధర్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం నిర్మితమవుతుంది.ఈ చిత్రానికి బ్యానర్ సహస్ర ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ నిశాంత్ ప్రెజెంట్స్, దర్శకత్వం బసి రెడ్డి రానా, నిర్మాత నరేంద్ర బుచ్చి రెడ్డిగారి, సినిమాటోగ్రఫీ చిన్న రామ్, మ్యూజిక్ లిజో కె జోష్, ఎడిటర్ అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్ నిఖిల్ హాసన్, పిఆర్ఒ శ్రీధర్ లుగా వ్యవహరిస్తున్నారు.
