హెవీ యాక్షన్ సన్నివేశాల్లో మెగా హీరో

Published on Apr 14, 2021 3:00 am IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘గని’ అనేది టైటిల్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వరుణ్ సైతం ఈ చిత్రం కోసం చాలానే కష్టపడుతున్నారు. అల్లు బాబీ, సిద్దు ముద్దలు దాదాపు రూ.35 కోట్ల వరకు ఖర్చుపెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రజెంట్ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇవి కూడ బాక్సింగ్ క్రీడకు సంబంధించిన సన్నివేశాలే.

వీటిలో వరుణ్ తేజ్ సహా సునీల్ శెట్టి, ఉపేంద్ర కూడ పాల్గొంటున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి కూడ బాక్సర్లగానే కనిపించనున్నారు. ఈ సన్నివేశాల కోసం స్పెషల్ సెట్ కూడ వేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం కానుంది. విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ శిక్షణ తీసుకుని వచ్చారు. మొదటిసారి వరుణ్ తేజ్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. జూలై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు టీమ్.

సంబంధిత సమాచారం :